చిలిపి అల్లరి, చూడచక్కటి అందం, ఆహా అనిపించే నవ్వు, సేవలోనూ ముందుండే గుణం... అన్ని కలగలిపిన ఓ అభినయ తార సమంత. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో ప్రముఖులు, అభిమానులూ విషెస్ తెలిపారు.
రామ్ పోతినేని: యువరాణి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రేమ, అదృష్టం కలగలిపిన నువ్వు ఎంతో స్ఫూర్తిదాయకం.
రానా: హ్యాపీ బర్త్‌డే టూయూ సిస్టర్.
సుశాంత్: పుట్టినరోజు శుభాకాంక్షలు సామ్. ఆన్ స్కీన్ర్, ఆఫ్ స్కీన్ర్.. అందరికీ ఇలాగే స్ఫూర్తిగా ఉండు.
త్రిష: హ్యాపీ బర్త్‌డే సామ్. ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా రాణించు.
హన్సిక: పుట్టినరోజు శుభాకాంక్షలు అందమైన సమంత. ఎప్పుడూ సంతోషంగా ఉండు.
రష్మిక: హ్యాపీ బర్త్‌డే సమంత మామ్. పుట్టినరోజు నాడు కేక్‌లు, అందరి ప్రేమతో ఎంజాయ్ చేయండి. నీ అభిమాని రష్మిక.
రకుల్‌ప్రీత్ సింగ్: అందమైన సమంతకు హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది సంతోషం, నవ్వులతో నిండిపోవాలని కోరుకుంటున్నా. ఓ వ్యక్తిగా నువ్వు స్ఫూర్తిదాయకం. ఇలాగే ఆదర్శంగా జీవించు.
అనుపమ పరమేశ్వరన్: క్యూట్ సామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి.