తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పుట్టినరోజునే సల్మాన్​కు మామగా ప్రమోషన్ - సల్మాన్​ఖాన్-అర్పితాఖాన్

కండలవీరుడు సల్మాన్​ఖాన్.. తన పుట్టినరోజునే మామగా ప్రమోషన్​ పొందాడు. సోదరి అర్పితాఖాన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Salman's sister Arpita, husband Aayush welcome baby girl
హీరో సల్మాన్​ఖాన్

By

Published : Dec 27, 2019, 4:30 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్​ఖాన్.. తన 54వ పుట్టినరోజున మామయ్యాడు. సోదరి అర్పితా ఖాన్ శుక్రవారం.. తన రెండో కాన్పులో అమ్మాయిని ప్రసవించింది. ఈ విషయాన్ని ఆమె భర్త ఆయుష్ శర్మ ఇన్​స్టాలో పంచుకున్నాడు. ఈ జంటకు ఇప్పటికే ఆహిల్ అనే మూడేళ్ల పిల్లాడు ఉన్నాడు.

"మాకు అమ్మాయి పుట్టింది. అండగా నిలిచిన మా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు అందరికి ధన్యవాదాలు" -ఆయుష్ శర్మ

ఆడబిడ్డ పుట్టడంపై ఆయుష్ శర్మ ఇన్​స్టా పోస్ట్

సల్మాన్​ఖాన్​ 'దబంగ్ 3'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్​ తెచ్చుకొని అలరిస్తోంది. ప్రస్తుతం 'రాధే' సినిమాలో నటిస్తున్నాడీ హీరో. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఈద్​కు థియేటర్లలోకి రానుంది.

ఇది చదవండి: స్టార్​ బర్త్​డే స్పెషల్​: హమారా భాయ్​జాన్​.. సల్మాన్​ఖాన్​

ABOUT THE AUTHOR

...view details