తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫ్యాన్​ను కొట్టాడని బౌన్సర్​ను కొట్టిన సల్మాన్! - security

తనను చూసేందుకు వచ్చిన చిన్నారిని కొట్టినందుకు.. తన సెక్యూరిటీ గార్డుపైనే చేయిచేసుకున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సల్మాన్

By

Published : Jun 6, 2019, 12:17 AM IST

రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మంది హీరోలు అభిమానులపై చేయి చేసుకోవడం చూసుంటాం.. కానీ సొంత బౌన్సర్​కే చెంప చెళ్లుమనిపించాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

'భారత్' సినిమా విడుదల సందర్భంగా ప్రీమియర్​కు వచ్చిన సల్మాన్ భాయ్​ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అందులో ఓ చిన్నారి సల్మాన్​ కోసం ముందుకు రాగా... సెక్యూరిటీ గార్డు ఆ చిన్నారిపై చేయిచేసుకున్నాడు. వెంటనే సల్మాన్ కోపంతో తన సెక్యూరిటీ గార్డు చెంప చెళ్లుమనిపించాడు.

ప్రస్తుతం ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో విశేషంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. సల్మాన్​కు మద్దతుగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details