తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరంజీవి సినిమాలో సల్మాన్​ఖాన్? - చిరంజీవి సల్మాన్​ఖాన్

మెగా ఫ్యాన్స్​కు కిక్కిచ్చే వార్త ఇది. మెగాస్టార్ చిరు కొత్త చిత్రంలో స్టార్​ కథానాయకుడు సల్మాన్​ఖాన్​ గెస్ట్​గా కనిపించనున్నారట. దీని గురించే ప్రస్తుతం చర్చంతా సాగుతోంది.

chiranjeevi salman khan
చిరంజీవి సల్మాన్​ఖాన్

By

Published : Aug 14, 2021, 4:45 PM IST

మెగాస్టార్​ చిరంజీవి 153వ సినిమా 'లూసిఫర్'​ రీమేక్.​ శుక్రవారం(ఆగస్టు 13) నుంచి షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త తెగ ఆసక్తి కలిగిస్తోంది.

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయమై స్పష్టత లేదు కానీ, ఒకవేళ నిజమైతే మాత్రం ఫ్యాన్స్​కు పండగే.

ఈ సినిమాను కోలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ మోహన్​ రాజా తెరకెక్కిస్తున్నారు. మెగాసూపర్​ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్​బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్​ నిర్మిస్తున్నారు. తమన్​ సంగీతమందిస్తున్నారు.

మలయాళ సూపర్​హిట్​ 'లూసిఫర్'కు రీమేక్​ ఇది. ఈ పొలిటికల్ డ్రామాలో మోహన్​లాల్, మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి తెలుగులో చిరుతో పాటు ఎవరెవరు నటిస్తున్నారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

ఇదీ చదవండి:రాధికా ఆప్టేను బహిష్కరించండి.. నెటిజన్ల డిమాండ్

ABOUT THE AUTHOR

...view details