బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటిస్తున్న చిత్రం 'దబాంగ్-3'. ఇప్పటికే టీజర్ అలరిస్తుండగా.. ఆ సందడిని మరికాస్త పెంచేందుకు ట్రైలర్ సిద్ధమైంది. ఈ బుధవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. ఈ సందర్భంగా హీరోయిన్ సోనాక్షి సిన్హా పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను పంచుకున్నాడు
ముంబయి, హైదరాబాద్ సహా మరో 9 ప్రధాన నగరాల్లో ట్రైలర్ లాంచ్ వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నారు. అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సల్మాన్.. అభిమానుల ముందుకు రానున్నాడు.