స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'కిక్' చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దీనికి కొనసాగింపుగా తెలుగులో వచ్చిన 'కిక్ 2' అనుకున్నంత స్థాయిలో ఆదరణకు నోచుకోలేదు. 'కిక్'ను హిందీలో రీమేక్ చేసి భారీ విజయాన్ని నమోదు చేశాడు సల్మాన్. తెలుగులో విజయవంతం కానప్పటికీ హిందీలో 'కిక్'ని కొనసాగించాలనుకుంటున్నాడీ హీరో.
మరింత 'కిక్' కోసం ముగ్గురు భామలు..! - ముగ్గురు హీరోయిన్లతో సల్మాన్
తెలుగులో వచ్చిన 'కిక్'కు కొనసాగింపుగా 'కిక్ 2' వచ్చింది. ఈ సినిమాకు అంతగా ఆదరణ దక్కలేదు. హిందీలో 'కిక్'ను రీమేక్ చేసిన సల్మాన్.. 'కిక్ 2' నూ తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఇందుకోసం ప్రణాళికలు జరుగుతున్నాయని సమాచారం.
సల్మాన్
అయితే ఇది తెలుగుకి రీమేక్ కాదు. హిందీలోనే కొనసాగింపుగా కొత్త కథతో ముందుకు వస్తాడని తెలుస్తుంది. ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారని సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు దర్శకుడు సాజిద్ చేపట్టాడని బాలీవుడ్ టాక్. మొదటి భాగంలో కనిపించిన జాక్వెలిన్‌తో పాటుగా పూజా హెగ్డె, కృతి సనన్‌లకి ఇందులో చోటు కల్పిస్తారని అనుకుంటున్నారు.
ఇవీ చూడండి.. నూతన కథానాయికతో నాగ్ రొమాన్స్..!