తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బిగ్​బాస్​ నుంచి సల్మాన్​ తప్పుకుంటున్నాడా? - తెలుగు సినిమా వార్తలు

హిందీ బిగ్​బాస్​కు వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్న హీరో సల్మాన్​ ఖాన్.. షో నుంచి​ వైదొలగాలని అనుకుంటున్నాడట. పోటీదారుల ప్రవర్తనే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Salman to quit as 'Bigg Boss' host, to be replaced by Farah Khan?
బిగ్​బాస్​ నుంచి సల్మాన్​ తప్పుకుంటున్నాడా?

By

Published : Dec 11, 2019, 8:01 PM IST

టెలివిజన్​ రియాల్టీ గేమ్​ షో హిందీ బిగ్​బాస్​కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్​.. షో నుంచి వైదొలగాలని భావిస్తున్నాడట. పోటీదారుల ప్రవర్తనతో విసుగు చెందడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

చివరి షోకు సంబంధించిన షూటింగ్​ షెడ్యూల్​ నిర్ణయించలేదు. ఈ నేపథ్యంలోనే సల్మాన్​ తరఫున ఫరాఖాన్​​​ వ్యాఖ్యాతగా వ్యవహరించనుందని సమాచారం. అంతే కాకుండా సల్మాన్​.. రోజంతా పని చేస్తుండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట. ఈ విషయంపై భాయ్​ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారని టాక్​.

ఈ వ్యాఖ్యలపై సల్మాన్​ తండ్రి సలీమ్​ఖాన్​ మాట్లాడాడు. అతడి ఆరోగ్యం బాగానే ఉందని, పైన చెప్పినవన్నీ అవాస్తవమని చెప్పారు. సల్మాన్​ను షో నుంచి బయటకొచ్చేయమని తాము ఎప్పుడూ చెప్పలేదని అన్నారు.

ఇవీ చూడండి.. తమన్ సంగీతానికి 'తకిట తకిట' అనాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details