బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్.. బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌లో పాల్గొని, పర్యావరణ హిత సందేశాన్ని అభిమానులకు చెప్పాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
వీడియోలో ఏముందంటే..!
బాటిల్ మూత తెరిచేందుకు సిద్ధమైన సల్మాన్‌ఖాన్.. కొంచెం వదులుగా ఉన్న దాన్ని నోటితో ఊదాడు. ఆ తర్వాత అందులో నీటిని తాగేశాడు. వీడియో చివర్లో 'పానీ బచావో'(నీటిని కాపాడండి) అంటూ అభిమానులకు సందేశమిచ్చాడు.
కొద్ది రోజులుగా ఈ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన అక్షయ్ కుమార్, టైగర్‌ష్రాఫ్, సిద్దార్థ్ మల్హోత్రా, పరిణీతి చోప్రా, సిద్దార్థ్ చతుర్వేది, కునాల్ ఖేము, సుస్మితా సేన్ తదితరులు.. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలను పంచుకున్నారు.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'దబాంగ్-3' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సంజయ్‌లీలా భన్సాలీ 'ఇన్షా అల్లా'లో అలియా భట్ సరసన నటించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇది చదవండి: సల్మాన్‌ఖాన్‌కు న్యాయస్థానం హెచ్చరిక