తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాక్వెలిన్​తో కలిసి పాటపాడిన సల్మాన్ - Salman shoots song with Jacqueline at his Panvel farmhouse

హీరో సల్మాన్​ఖాన్.. నటి జాక్వెలిన్​తో కలిసి 'తేరే బినా' అంటూ ఓ పాట పాడారు. ఆ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

Salman shoots song with Jacqueline at his Panvel farmhouse
సల్మాన్​ఖాన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్

By

Published : May 9, 2020, 3:56 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్​ఖాన్.. మరోసారి తనలోని గాయకుడిని బయటకు తీశారు. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్​తో కలిసి 'తేరా బినా' అంటూ పాడారు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పంచుకున్నారు.

'లాక్​డౌన్ కాన్వర్జేషన్స్' పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సల్మాన్​ మాట్లాడుతూ.. "ఇది కేవలం నాకోసమే పాడుకున్నాను దీనిని చిత్రీకరించడానికి నాలుగు రోజులు పట్టింది. ఈ పాటను ఏ సినిమాలోనూ పెట్టాలనుకోవట్లేదు" అని చెప్పారు.

లాక్​డౌన్ విధించినప్పటి నుంచి ముంబయికి కొంచెం దూరంలో ఉన్న తన ఫామ్​హౌస్​లో ఉంటున్నారు సల్మాన్. ఇతడితో పాటు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, టీవీ వ్యాఖ్యాత లూలియ వంతూర్ తదితరులు అక్కడే ఉన్నారు. ఆ ప్రాంతానికి దగ్గరలోని గ్రామ ప్రజలకు, ఈ మధ్యే నిత్యావసర సామాగ్రిని అందజేశారు ఈ కథానాయకుడు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'రాధే'లో సల్మాన్ నటిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details