కరోనా వైరస్ కట్టడిపై అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వినూత్నంగా ఆలోచించాడు. ఇందుకోసం 'మైనే ప్యార్ కియా' (1989) సినిమాలోని సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశాడు. సల్మాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన సినిమా ఇది. ఈ చిత్రంలో సల్మాన్ ఇంటికి వచ్చిన భాగ్యశ్రీ అతడికి చెప్పకుండా వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఇంట్లోని గాజు గోడకు లేఖ అంటించి, ముద్దు (లిప్‌స్టిక్) గుర్తును వదిలి వెళ్తుంది. ఆపై లేఖ చదివిన సల్మాన్ ఆమె జ్ఞాపకాన్ని కిస్ చేస్తాడు. ఇప్పుడు ఇదే సీన్‌ను సల్మాన్ కరోనా ట్విస్ట్‌తో చేసి చూపించాడు. గాజు గోడపై ఉన్న లిప్‌స్టిక్ గుర్తును కిస్ చేయడానికి బదులుగా.. లిక్విడ్ చల్లి, వస్త్రంతో తుడిచేశాడు.
కరోనా సమయంలో 'మైనే ప్యార్ కియా'.. సల్మాన్ ఫన్నీ సీన్! - corona
కరోనా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. వీటితో పాటుగా కొంతమంది సినీప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ వీటికి భిన్నంగా ఆలోచించాడు. కరోనాపై ప్రజల్లో అవగాహన నింపటానికి వినోదాత్మక సందేశాన్ని ఇచ్చాడు.
సీన్ రీక్రియేషన్‌లో సల్మాన్ అలా ఎందుకు చేశాడు?
ఈ వీడియోను షేర్ చేస్తూ సల్మాన్ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పాడు. బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించమని ప్రజలను కోరాడు. ఈ వీడియో నెటిజన్లలో అవగాహన కల్పించడంతోపాటు నవ్విస్తోంది. మూడు గంటల్లో దాదాపు 10 లక్షల మంది వీడియోను చూశారు. 13 వేల మంది కామెంట్ చేశారు. సల్మాన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబయిలోని ఫాంహౌస్‌లో ఉన్నాడు.
ఇదీ చూడండి..'ఆర్ఆర్ఆర్'లో నవదీప్.. క్లారిటీ ఇచ్చేశాడు!