తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫొటో నుంచి ఐశ్వర్యను తీసేసిన సల్మాన్!

'మలాల్' చిత్రం ద్వారా బాలీవుడ్​కు పరిచయం అవుతున్న షర్మిన్ సెగల్​కు శుభాకాంక్షలు చెబుతూ సల్మాన్ ఓ ఫొటో షేర్ చేశాడు. కానీ... కొన్నేళ్ల క్రితంనాటి ఆ ఫొటోలోని ఓ అంశం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.

సల్మాన్

By

Published : May 20, 2019, 3:53 PM IST

సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ప్రేమ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగిన వీరిద్దరూ తర్వాత విడిపోయారు. తాజాగా ఈ అంశాన్ని గుర్తుచేశారు నెటిజన్లు. ఇందుకు కారణం ఓ ఫొటో.

'మలాల్​' చిత్రం ద్వారా బాలీవుడ్​లోకి తెరంగేట్రం చేస్తున్న షర్మిన్ సెగల్​కు శుభాకాంక్షలు చెబుతూ సల్మాన్​ఖాన్​ ఓ ఫొటో షేర్ చేశాడు.ఆ ఛాయచిత్రంలో సంజయ్​ లీలా భన్సాలీకి షర్మిన్ కేక్​ తినిపిస్తోంది.పక్కనే ఐశ్వర్యరాయ్​ ఉన్నప్పటికీ కనిపించకుండా క్రాప్ చేశాడు. అది కాస్త వైరల్​గా మారింది.

సంజయ్​ దర్శకత్వంలో సల్మాన్ 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాలో నటించాడు. 2002లో వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్. ఆ సమయంలో దిగిన ఫొటోను సల్మాన్ తాజాగా ట్విట్టర్లో పోస్టు చేశాడు. అప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికారు చేశాయి.

ఆ ఫొటోలో ఉంది ఐశ్వర్యరాయే కదా అని ఒకరు ట్వీట్ చేయగా... అవును 'హమ్ దిల్​ దే చుకే సనమ్' సినిమా సెట్​లో దిగిన ఫొటో అంటూ మరొకరు స్పందించారు. ఫొటోను ఎలా క్రాప్ చేశాడో చూశారా... అంటూ ఇంకొకరు ఫన్నీగా పోస్ట్ చేశారు. మొత్తానికి ఈ పాత ప్రేమికులు నెట్టింట మళ్లీ చక్కర్లు కొడుతున్నారు.

సంజయ్​ లీలా భన్సాలీ తన మేనకోడలు షర్మిన్ సెగల్​ను 'మలాల్'​ చిత్రం ద్వారా లాంచ్​ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంగీతం అందించడమే కాక నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంలో జావేద్ జాఫ్రే తనయుడు మెజాన్ జాఫ్రే హీరో.

ABOUT THE AUTHOR

...view details