తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"ప్లాస్టిక్ నివారణపై ముందడుగేద్దాం"

ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ సంకల్పించిన ఉద్యమానికి బాలీవుడ్ తారలు సల్మాన్, మాధురి, కత్రినా కైఫ్ మద్దతు తెలిపారు. ముంబయిలో ఐఫా అవార్డుల వేడుక విలేకరుల సమావేశంలో ఈ విషయంపై స్పందించారు.

By

Published : Sep 7, 2019, 10:33 AM IST

Updated : Sep 29, 2019, 6:11 PM IST

సల్మాన్

ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన ప్లాస్టిక్ నిషేధ ఉద్యమానికి బాలీవుడ్ తారలు సల్మాన్​ఖాన్​, మాధురి దీక్షిత్, కత్రినా కైఫ్ తమ మద్దతు తెలిపారు. ప్లాస్టిక్ నివారించేందుకు అందరూ కలిసిరావాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ఇది మోదీ అద్భుతమైన ఆలోచన అంటూ ప్రశంసించారు.

"ప్లాస్టిక్​ నిషేధానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి. ప్లాస్టిక్​ను వాడకండి.. ప్లాస్టిక్​ను దరిచేరనీయకండి" -సల్మాన్ ఖాన్​, బాలీవుడ్ హీరో

పర్యావరణం పట్ల బాధ్యత పెంచుకోవాలని తెలిపింది బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్.

"నాకు పిల్లలు పుట్టినప్పటి నుంచి ప్రతి తల్లిదండ్రులకు చెబుతున్నాను. మన సంతానం.. వారికి పుట్టబోయే పిల్లలు ఎలాంటి గ్రహం మీద జీవనం గడపబోతున్నారో మనం ఆలోచించుకోవాలి. పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలి. ప్లాస్టిక్​పై ఉమ్మడిగా పోరాటం చేయాలి" - మాధురి దీక్షిత్, బాలీవుడ్ నటి

ప్లాస్టిక్​ నిషేధం వైపు మనం వేసే ఒక్క అడుగైనా భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తుందని కత్రినా కైఫ్​ అభిప్రాయపడింది.

"మన ముందు ఏం జరుగుతుందో మనకు అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని సులభంగా మర్చిపోవచ్చు. కానీ ప్లాస్టిక్ నిషేధం వైపు మనం వేసే ఒక్క అడుగైనా భవిష్యత్తులో పెద్ద మార్పునకు దోహదపడుతుంది. ఈ అంశంపై ప్రధాని మోదీ ఆలోచన అద్భుతం. మనమందరం ఇందుకు మద్దతు పలకాలి" -కత్రినాకైఫ్, బాలీవుడ్ నటి.

మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కరించుకుని ఆయనకు నివాళిగా భారత్​ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు సంకల్పించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. మనసులో మాట(మన్ ​కీ బాత్) కార్యక్రమం ద్వారా మోదీ ఇటీవలే ఈ ఉద్యమానికి తెరలేపారు.

ఇది చదవండి: 'మరింత కష్టపడతా.. వారికి నచ్చేలా కనిపిస్తా'

Last Updated : Sep 29, 2019, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details