బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించాడు. గోవా విమానాశ్రయంలో స్వీయచిత్రాన్ని తీసుకోవడానికి ప్రయత్నించిన అభిమాని చరవాణిని లాగేసుకున్నాడు. ఒక్క క్షణం ఆ అభిమాని ఆశ్చర్యానికి లోనయ్యాడు.
సెల్ఫీ అడిగితే ఫోన్ లాగేసుకున్న సల్మాన్ - సల్మాన్‌ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఓ అభిమాని చరవాణిలో స్వీయచిత్రం తీసుకుంటున్న సమయంలో అతడి ఫోన్‌ను లాగేసుకున్నాడు.
సెల్ఫీ అడిగితే ఫోన్ లాగేసుకున్నాడు
అభిమాని దగ్గర నుంచి చరవాణి లాగేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించినట్లుగా ఆ వీడియోలో ఉంది. అతను విమానాశ్రయంలో పనిచేసే గ్రౌండ్స్టాఫ్గా తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని విమానాశ్రయానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి.. దిల్లీ రాజకీయాల్లో అడుగుపెట్టనున్న యంగ్‌టైగర్..!
Last Updated : Feb 28, 2020, 7:28 AM IST