బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ నటిస్తున్న చిత్రం 'దబాంగ్ -3'. ముంబయిలో ఇటీవలే ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ఓ విలేకరి అన్న మాటకు విపరీతంగా నవ్వాడీ కథానాయకుడు.
ఇంతకీ ఆ సంగతి ఏంటంటే?
"సుమారుగా 50 మంది కొత్తవారిని పరిచయం చేశారు. అందుకే మిమ్మల్మి 'మదర్ థెరిసా ఆఫ్ బాలీవుడ్" అనొచ్చని ఓ విలేకరి అన్నారు. ప్రతిగా స్టేజిపై ఉన్న చిత్రబృందం అంతా ఘొల్లున నవ్వుకున్నారు. సల్మాన్ అయితే తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. అయితే ఈ కార్యక్రమం మొత్తంలో విలేకర్లు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదీ హీరో.