కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల వరుసగా బాలీవుడ్ సినిమాల విడుదల తేదీలు వాయిదా పడుతున్నాయి. అయితే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. తాను నటించిన 'రాధే' సినిమాను అంతకుముందు ప్రకటించిన తేదీకే మే 13న రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు సహా ఓటీటీ ప్లాట్ఫాం(జీ5, జీప్లెక్స్)లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.