'కిక్' లాంటి భారీ విజయం తర్వాత సల్మాన్‌ఖాన్, నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'కబీ ఈద్ కబీ దివాలీ'. ఫర్హాద్ సామ్‌జీ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్ కీలక పాత్రలు చేస్తున్నారు.అయితే ఈ సినిమా టైటిల్ మార్చాలనే ఆలోచనల చిత్రబృందం ఉందట.
సల్మాన్‌ఖాన్ సినిమా పేరు మార్పు! - కభీ ఈద్ కభీ దివాలీ టైటిల్ మార్పు
సల్మాన్‌ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా పేరు మార్చాలని చిత్రబృందం ఆలోచిస్తోంది. మతపరమైన వివాదాలు వస్తాయనే ఆలోచనతోనే ఇలా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
"కబీ ఈద్ కబీ దివాలీ' టైటిల్ మార్చనున్నాం. పలు పేర్లు పరిశీలిస్తున్నాం. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. రెండు మతాలకు సంబంధించిన కీలక పండగల పేర్లు ఇందులో ఉండటం వల్ల వివాదాలు చెలరేగుతాయేమో అనే ఆలోచనలో చిత్రబృందం ఉంది. అన్ని మతాల్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ సినిమాకు కొత్త టైటిల్‌ను నిర్ణయించనున్నాం" అని సాజిద్ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం. దేవుడు ఒక్కడే అనే ఇతివృత్తంతో సాగే కథ ఇది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఇదీ చూడండి:అదిరిపోయే కాన్సెప్ట్‌తో 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'