సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా 'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫర్హాద్ సామ్‌జీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పేరును మార్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి.
సల్మాన్ కొత్త సినిమా టైటిల్ ఇదే! - కభీ ఈద్ కభీ దివాలీ టైటిల్ మార్పు
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్, నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా కాంబోలో రూపొందుతోన్న కొత్త చిత్రం 'కభీ ఈద్ కభీ దివాలీ'. అయితే ఇటీవలే ఈ టైటిల్‌ను మార్పు చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఆ టైటిల్‌కు బదులుగా 'భాయీజాన్' పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సల్మాన్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
అయితే ప్రస్తుతం సాజిద్ ఓ కొత్త పేరును రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ 'భాయీజాన్'. అది సల్మాన్ చిత్రం కోసమే అని తెలుస్తోంది. యాక్షన్, కామెడీతో సాగే ఈ చిత్రానికి, ఇలాంటి ఓ కథకు ఈ టైటిల్ అయితేనే సరిపోతుందని చిత్రబృందం భావిస్తోందట. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి:ఐశ్వర్య సోయగం.. చూసితీరాలి కచ్చితం!