తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈద్​కు 'ఇన్షా అల్లా' అంటున్న సల్మాన్​ - bollywood

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్​కు, ఈద్​కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ రోజు విడుదలైన సల్మాన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. 2020 ఈద్​ రోజు తన తదుపరి చిత్రం 'ఇన్షా అల్లా' విడుదలవబోతుంది.

సల్మాన్

By

Published : Jun 7, 2019, 4:13 PM IST

సినిమా హీరోలకు రిలీజ్ సెంటిమెంట్ ఉంటుంది. కొన్ని పండుగలు వస్తున్నాయంటే ఆ హీరో చిత్రం కచ్చితంగా వస్తుందనే నమ్మకం ఉంటుంది. అలాగే బాలీవుడ్​ హీరో సల్మాన్ ఖాన్​కు, ఈద్​కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ పండుగకు విడుదలైన భాయ్​జాన్ చిత్రాలు ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరోసారి ఈద్​కు​ వచ్చేందుకు సిద్ధమయ్యాడు సల్మాన్.

ఈ ఏడాది ఈద్‌కు 'భారత్‌’' చిత్రంతో వచ్చి సినీప్రియుల్ని పలకరించాడు సల్మాన్. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పుడీ సందడి మధ్యే సల్మాన్‌ మరో శుభవార్త వినిపించేశాడు. ‘

'భారత్‌' తర్వాత సల్మాన్​ నటించిన 'ఇన్షా అల్లా' సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆలియా భట్‌ కథానాయిక. ఈ చిత్ర రిలీజ్‌ పోస్టర్‌ను ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘‘వచ్చే ఏడాది ఈద్‌కు.. ఇన్షా అల్లా’ అంటూ పోస్ట్ చేసింది.

ఇన్షా అల్లా విడుదల పోస్టర్

ఇవీ చూడండి.. హిందీలో మళ్లీ 'జింతాతా చితా చితా'...!

ABOUT THE AUTHOR

...view details