Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఇటీవల (డిసెంబర్ 27) తన 56వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో జరిగిన ఈ వేడుకలు కుటుంబసభ్యులు, స్నేహితులు హాజరై ఖరీదైన గిఫ్ట్‌లు అందచేశారు. బీఎండబ్ల్యూ కారు, డైమండ్ బ్రాస్‌లెట్ వంటివి ఈ బహుమతుల జాబితాలో ఉన్నాయి. ఇంతకీ సల్మాన్‌కు ఎవరెవరు ఏయే బహుమతులు అందించారంటే..
సల్మాన్ బర్త్‌డేకు రూ.కోట్లలో కానుకలు.. కత్రినా ఏమిచ్చిందంటే? - salman khan katrina
Salman Khan: ఇటీవలే తన 56వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేసుకున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఈ పార్టీకి బీటౌన్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భాయ్‌కు రూ.కోట్లు విలువజేసే కారు, బ్రాస్లెట్లు కానుకగా ఇచ్చారు. మరి కత్రినా కైఫ్ ఏమిచ్చిందంటే?
నటి కత్రినాకైఫ్ సుమారు రూ.3లక్షలు పెట్టి సల్మాన్ కోసం ప్రత్యేకంగా బంగారపు బ్రాస్‌లెట్‌ను పంపించారట. జాక్వెలిన్.. స్పెషల్ వాచ్ (రూ.12 లక్షలు), సంజయ్ దత్.. డైమండ్ బ్రాస్‌లెట్ (రూ.8 లక్షలు), అనిల్‌కపూర్.. జాకెట్ (రూ.29 లక్షలు), శిల్పాశెట్టి.. డైమండ్ అండ్ గోల్డ్ బ్రాస్‌లెట్ (రూ. 17 లక్షలు), సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ .. రోలెక్స్ వాచ్ (రూ.17 లక్షలు), సోదరులు సోహైల్, అర్బజ్‌ఖాన్‌లు.. బీఎండబ్ల్యూ కారు (రూ.25 లక్షలు), ఆడీ కారు( రూ.3కోట్లు) ఇచ్చారట. మరోవైపు సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ జుహులో రూ.12 కోట్లు విలువ చేసే అపార్ట్‌మెంట్‌ని పుట్టినరోజు బహుమతిగా అందచేశారట.