తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్​తో ఐశ్వర్య, కరీనా.. ఏ జోడీ పాపులర్! - Salman Khan With Kareena Kapoor Had Impressive Chemistry

సల్మాన్ ఖాన్​-ఐశ్వర్యా రాయ్, సల్మాన్​-కరీనా కపూర్.. వీరి కాంబినేషన్​లో సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు థియేటర్లకు హోరెత్తేవారు. ఆన్​స్క్రీన్​ మీద​ పండించే వీరి కెమిస్ట్రీ అభిమానుల హృదయాలను హత్తుకునేది. అంతలా నటనలో ఒదిగిపోయేదీ జోడీ. మరి వీరి కాంబో ఏ సినిమాతో ప్రారంభమైంది?, ఏఏ సినిమాలు వచ్చి ఘనవిజయం సాధించాయి? వంటి విశేషాలపై ఓ లుక్కేద్దాం.

salman
సల్మాన్​

By

Published : Jun 2, 2020, 3:40 PM IST

Updated : Jun 2, 2020, 6:27 PM IST

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో హిందీ చిత్రసీమలో స్టార్​ హీరోగా కొనసాగుతున్నారు సల్మాన్ ​ఖాన్​. వెండితెరపై అరంగేట్రం చేసి దాదాపు 30ఏళ్లు గడిచిన భాయ్​జాన్​కు.. అభిమానుల్లో ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్​లో ఆన్​స్క్రీన్​ మీద ఎంతో మంది హీరోయిన్స్​తో కలిసి లవ్​, రొమాంటిక్, యూక్షన్​ సినిమాల్లో​ అలరించారు. పలువురు కథానాయికలనూ వెండితెరకు పరిచయం చేశారు. అలా ఎంతోమంది హీరోయిన్స్​తో కలిసి సల్మాన్ చిందులే​సినా.. అభిమానుల మదిలో నిలిచిపోయేది మాత్రం సల్మాన్​-ఐశ్వర్య, సల్మాన్​-కరీనా కపూర్​ జంటలే. ఎందుకంటే తెరపై వీరు పండించే కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను తాకేది. వీరి సినిమా విడుదలైందంటే ప్రేక్షకులు సినిమా హాళ్లకు హోరెత్తేవారు. అంతలా ఆకట్టుకునేది వీరి నటన. మరి వీరి కాంబో ఏ సినిమాతో ప్రారంభమైంది?, ఏఏ సినిమాల్లో కలిసి నటించారు, అవి ఎంతగా ప్రజాదరణ పొందాయి వంటి విశేషాలపై ఓ లుక్కేద్దాం.

సల్మాన్​-ఐశ్వర్య

'హమ్ దిల్ దే చుకే సనమ్'.. (నా హృదయాన్ని ఇచ్చేశాను ప్రేయసీ!) హృదయం ఇచ్చి పుచ్చుకోవడంలోని అనిర్వచనీయ ఆనందాన్ని ఈ సినిమా అందంగా ఆవిష్కరించింది. 1999లో విడుదలైన ఈ సినిమాతో సల్మాన్​ఖాన్​-ఐశ్వర్యా రాయ్​ జంట పరిచయమైంది. ప్రముఖ దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముక్కోణపు ప్రేమ కథా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలోని సల్మాన్​-ఐశ్వర్య కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. అజయ్​ దేవగణ్​ మరో హీరోగా ఇందులో నటించారు. 45వ ఫిల్మ్​ఫేర్ అవార్డుల్లో 16 నామినేషన్స్​తో సత్తాచాటిందీ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా రూ. 51 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆ తర్వాత 'ధాయ్​ అక్షర్​ ప్రేమ్​ కి', 'హమ్​ తుమ్హారే హెయిన్​ సనమ్'​ సినిమాల్లోనూ కనిపించిందీ జోడీ.

సల్మాన్​-కరీనా

సల్మాన్​-కరీనా కపూర్.. వీరిద్దరి జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరీనా​తో కలిసి భాయ్​జాన్ ఆన్​స్క్రీన్​​ మీద పండించిన కెమిస్ట్రీ ప్రేక్షకులను మైమరిపించింది. ఇప్పటికీ వీరి కాంబోలో సినిమాలు విడుదలై అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.

ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన 'క్యోన్​ కి' సినిమాతో వీరి జంట పరిచయమైంది. ఈ సినిమాకు ప్రియదర్శన్​ దర్శకత్వం వహించారు. 1986లో వచ్చిన మలయాళం సినిమా 'థలవత్తమ్' రీమేక్​గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా నెగటివ్​ టాక్​ అందుకున్నప్పటికీ సల్మాన్​-కరీనా నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. వీరిద్దరి మధ్య జరిగిన ప్రేమ, రొమాంటిక్​, భావోద్వేగ సన్నివేశాలు ఫ్యాన్స్​ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి .

ఆ తర్వాత 2009లో 'మై ఔర్​ మిసెస్ ఖన్నా' సినిమాలో కలిసి నటించారు సల్మాన్-కరీనా. ఈ చిత్రం నెగటివ్​ టాక్​ తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకులను తమ నటనతో మరోసారి ఫిదా చేసిందీ జోడీ. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 25 కోట్ల వసూళ్లను సాధించింది. అనంతరం 2011 'బాడీగార్డ్​' 200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టగా, 'భజరంగీ భాయ్​జాన్' ప్రపంచవ్యాప్తంగా​ దాదాపు 900 కోట్ల ​వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.

ఇదీ చూడండి : ముజఫర్​పుర్​ బాలుడ్ని దత్తత తీసుకున్న షారుక్​

Last Updated : Jun 2, 2020, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details