ఈద్ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్. కరోనా తీవ్రమవుతున్న తరుణంలో ముఖానికి కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఫొటోను పోస్ట్ చేశారు. ఇతడితో పాటు పలువురు సినీ ప్రముఖులు పండగ శుభాకాంక్షలు చెబుతున్నారు.
కరోనా జాగ్రత్తలతో సల్మాన్ 'ఈద్' శుభాకాంక్షలు - salman radhe
కరోనా వేళ అందరూ జాగ్రత్రగా ఉండాలని చెబుతూ, ఈద్ శుభాకాంక్షలు తెలిపారు అగ్రహీరో సల్మాన్‌ఖాన్. ప్రస్తుతం భాయ్.. 'రాధే' సినిమాలో నటిస్తున్నారు.
![కరోనా జాగ్రత్తలతో సల్మాన్ 'ఈద్' శుభాకాంక్షలు కరోనా జాగ్రత్తలతో సల్మాన్ ఈద్ శుభాకాంక్షలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8256398-1061-8256398-1596272365584.jpg)
సల్మాన్‌ఖాన్
సల్మాన్.. ప్రస్తుతం 'రాధే' సినిమాలో నటిస్తున్నారు. తన 'వాంటెడ్', 'దబంగ్ 3' చిత్రాలను తీసిన ప్రభుదేవా.. దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దిశాపటానీ హీరోయిన్. కరోనా షూటింగ్ నిలిచిపోయింది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టాలని భావిస్తున్నారు.