తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఐఫా అవార్డుల వేడుక షురూ.. వ్యాఖ్యాతగా సల్మాన్​ - ఇండోర్​

హిందీ చిత్రసీమకు ఐఫా అవార్డుల వేడుక అంటే ఓ పండుగ. నటీనటులంతా కలసి ఆటపాటలతో అలరించే ఈ కార్యక్రమం త్వరలోనే జరగనుంది. మెగా సంబరానికి మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ వేదిక కానుంది. బాలీవుడ్​ స్టార్​ కథానాయకుడు సల్మాన్​ఖాన్​ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.

Salman Khan unveils IIFA 2020 in Indore, says I was conceived in Mumbai, but I was born in Indore
ఇండోర్​ వేదికగా ఐఫా అవార్డ్స్ వేడుక​

By

Published : Feb 5, 2020, 9:18 AM IST

Updated : Feb 29, 2020, 6:04 AM IST

బాలీవుడ్‌కు ఎంతో ఇష్టమైన అవార్డుల వేడుక 'ది ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ అవార్డ్స్‌' (ఐఫా). పురస్కారాలు అందుకోవడమే కాకుండా.. తారలందరూ ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేసే కార్యక్రమం అది. ఈ వేడుకకు ఈసారి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వేదిక కానుంది. మార్చి 27 నుంచి 29 వరకూ 'ఐఫా' జరగనుంది.

వ్యాఖ్యాతగా సల్మాన్​..
ఈ వేడుకలో సల్మాన్​ఖాన్​ వ్యాఖ్యాతగా కనువిందు చేయనున్నాడు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ఖాన్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను పుట్టిన ఇండోర్​లో అభిమానులను అలరించే అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు భాయ్​.

ఇదీ చూడండి.. 'రాధే', 'లక్ష్మీ బాంబ్​'తో పోటీకి సై అంటున్న హాలీవుడ్​ చిత్రం!

Last Updated : Feb 29, 2020, 6:04 AM IST

ABOUT THE AUTHOR

...view details