తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హిట్​ కొట్టినా ఛాన్సే రాలేదు.. చాలా బాధపడ్డా: సల్మాన్​ - సల్మాన్​ ఖాన్ మైనే ప్యార్​ కియా

తాను నటించిన(salman khan first movie name) తొలి సినిమా సూపర్​హిట్​ అయినప్పటికీ చాలా కాలం అవకాశాలు రాలేదని.. అందుకు చాలా బాధపడినట్లు గుర్తుచేసుకున్నారు బాలీవుడ్​ స్టార్​ సల్మాన్​ఖాన్​. హిట్​ క్రెడిట్​ అంతా ఆ చిత్రంలోని హీరోయిన్​ ఎగరేసుకుపోయిందని చెప్పారు.

salman
సల్మాన్​

By

Published : Oct 16, 2021, 8:00 PM IST

ఒక చిత్రం(salman khan first movie name) హిట్‌ కొట్టగానే అందులో నటించిన నటులకు వరుసపెట్టి అవకాశాలు వస్తుంటాయి. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం.. చేసుకోకపోవడం వేరే విషయం. పాపం సల్మాన్‌ఖాన్‌(salman khan first movie in bollywood ).. తను హీరోగా నటించిన తొలి చిత్రం 'మైనే ప్యార్‌ కియా' బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ కొట్టినా.. కొన్ని నెలలపాటు అతనికి ఎలాంటి అవకాశాలు రాలేదట. హిట్‌ ఘనతను తనకు జోడీగా నటించిన భాగ్యశ్రీ ఎగరేసుకుపోయిం(salman khan maine pyar kiya movie)దని ఓ సందర్భంలో సల్మాన్‌ తన తొలి చిత్రం తర్వాత ఎదురైన పరిస్థితులను వివరించాడు.

" 'మైనే ప్యార్‌ కియా'(salman khan maine pyar kiya photo) చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. కానీ, ఆ ఘనతను భాగ్యశ్రీ కొట్టేసింది. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ సినిమా హిట్‌ కావడానికి భాగ్యశ్రీనే కారణమని, నేను ఏదో ఉన్నాను అంటే ఉన్నాననుకున్నారు. దీంతో నాలుగైదు నెలల వరకు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. పైగా భాగ్యశ్రీ పెళ్లి చేసుకొని నటనకు దూరం కావాలని నిర్ణయించుకోవడం వల్ల ఇక నాకు అవకాశాలే రావని బాధపడ్డాను" అని చెప్పుకొచ్చాడు.

అయితే, సల్మాన్‌ అలా బాధపడటం చూడలేక అతడి తండ్రి సలీం ఖాన్‌(salman khan father name).. జీపీ సిప్పీ అనే నిర్మాతను పిలిచి.. సల్మాన్‌తో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించమని చెప్పాడట. ఆ ప్రకటన పత్రికలు, మ్యాగజైన్‌లలో రావడంతో ఇతర దర్శకులు, నిర్మాతల నుంచి సల్మాన్‌కు ఆఫర్లు వచ్చాయి. 'మైనే ప్యార్ కియా' చిత్రానికి సల్మాన్‌ పారితోషికంగా రూ.31వేలు తీసుకోగా.. తర్వాత అతడి పారితోషికం రూ.75వేలకు పెరిగిందట.

సల్మాన్‌ఖాన్‌తోపాటు హీరోయిన్‌ భాగ్యశ్రీ, దర్శకుడు సూరజ్‌ బర్జాత్యాకు కూడా ఇదే తొలి సినిమా(salmankhan movies list). సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయి.. పేదింటికి చెందిన అమ్మాయి ప్రేమలో పడతారు. ఆ తర్వాత వారికి ఎదురయ్యే పరిస్థితులే కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం 1989 డిసెంబర్‌29న విడుదలైంది. కథ, పాటలు ప్రేక్షకులకు అమితంగా నచ్చడం వల్ల బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ సాధించింది. అప్పటి బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా 'మైనే ప్యార్‌ కియా' రికార్డు సృష్టించింది.

ఇదీ చూడండి: కోహ్లీకి తెలియకుండానే టీమ్​ఇండియా కోచ్​గా ద్రవిడ్?

ABOUT THE AUTHOR

...view details