తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షార్ట్​ఫిల్మ్​లో సల్మాన్​ ఖాన్​.. ఫామ్​హౌస్​లో షూటింగ్! - తాజా సల్మాన్​ఖాన్​ వార్తలు

లాక్​డౌన్​ వేళ పలు ఆల్బమ్ గీతాల్లో నటిస్తున్న హీరో సల్మాన్.. త్వరలో ఓ లఘ చిత్రం రూపొందించనున్నారట. ప్రస్తుతం తన సొంత ఫౌమ్​హౌస్​లోనే ఉన్నారు సల్మాన్.

Salman Khan to shoot short film at his farmhouse?
ఫామ్​హౌస్​లో షార్ట్​ఫిల్మ్​కు సల్మాన్​ సన్నాహాలు?

By

Published : Jun 10, 2020, 10:42 AM IST

ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే సినీతారలు.. లాక్​డౌన్​తో వచ్చిన ఖాళీ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో సన్నిహితులతో కొందరు కబుర్లు చెబుతుంటే.. మరికొందరు అభిమానులతో టచ్​లో ఉన్నారు. బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ ఖాన్​.. ఇప్పటికే తన ఫామ్​హౌస్​లో చిత్రీకరించిన మూడు పాటలను విడుదల చేసి అభిమానుల్లో హుషారు నింపారు.

ఇదే క్రమంలో సల్మాన్​.. ఓ షార్ట్​ఫిల్మ్​ను తీయనున్నారట. ఇందులో భాయ్​​​తో పాటు వలుషా డిసౌజా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సల్మాన్​ యూట్యూబ్​ ఛానెల్​లో పోస్ట్ చేసిన.. 'తేరే బినా', 'భాయ్​ భాయ్'​, 'ప్యార్​ కరోనా' పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 'తేరే బినా' పాట అయితే 24 గంటల్లోనే 1.2 కోట్ల వీక్షణలు పొంది.. వారంలో 2.6 కోట్ల వ్యూస్​కు చేరువైంది.

ఇదీ చూడండి:సినీ చరిత్రలో జూన్ 9వ తేదీది చెరగని ముద్ర

ABOUT THE AUTHOR

...view details