బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న సినిమా 'పఠాన్'. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటించనున్నట్లు కొద్దికాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు సల్మాన్ దుబాయ్ వెళ్లారని తెలిసింది. 'ఏక్తా టైగర్' సినిమాలో ఆయన పోషించిన 'రా' ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ పాత్రతోనే 'పఠాన్' సినిమాలోనూ కనిపించనున్నారని వినికిడి. ఆయన పాత్ర నిడివి 15 నిమిషాల పాటు ఉండనుందట.
కాగా, హీరో హృతిక్‌రోషన్ కూడా ఈ సినిమాలో కనువిందు చేయనున్నట్లు సమాచారం. 'వార్' చిత్రంలో తాను నటించిన కబీర్ పాత్రతోనే షారుక్ సినిమాలో అలరించనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.