గత కొన్నేళ్ల నుంచి ప్రతి ఈద్ పండక్కి, కొత్త సినిమాలతో అభిమానుల ముందుకొస్తున్నాడు స్టార్ హీరో సల్మాన్‌ఖాన్. ఈ ఏడాది 'రాధే' చిత్రాన్ని తీసుకురావాలని అనుకున్నాడు. కానీ అనుకోని అవాంతరంలా కరోనా పంజా విసిరింది. దీంతో అన్ని ఇండస్ట్రీల షూటింగ్‌లు, విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ బాబితాలోకి ఇప్పుడు భాయ్ సినిమా చేరింది. మే 22న విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పుడు ఆ తేది మారే అవకాశమే ఎక్కువగా ఉంది.
ఈద్ నాటికి కష్టమే
'రాధే'ను మార్చి కల్లా పూర్తి చేయాలని చిత్ర బృందం భావించింది. ఆ నెల మధ్యలో కరోనా భారత్‌లోకి ప్రవేశించడం, లాక్డౌన్ విధించడం వల్ల పనులు సగంలో నిలిచిపోయాయి. ఒకవేళ పరిస్థితులు చక్కబడి, తిరిగి పనులు ప్రారంభించినా ఈద్ నాటికి చిత్రాన్ని పూర్తి చేయడం కష్టమనే తెలుస్తోంది.
కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ 'ద అవుట్లాస్'కు రీమేక్‌గా 'రాధే'ను రూపొందిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఓ పోలీస్ అధికారిగా సందడి చేయనున్నాడు. దిశా పటానీ హీరోయిన్. రణ్‌దీప్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రధారులు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. సల్మాన్, సొహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనా తీవ్రత తగ్గిన వెంటనే #ప్రభాస్20 అప్డేట్స్