తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బిగ్​ బాస్' కోసం సల్మాన్ పారితోషికం ఎంతో తెలుసా..? - big boss

బాలీవుడ్ సూపర్ స్టార్​ సల్మాన్ ఖాన్​ 'బిగ్​ బాస్'​ షో కోసం భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నాడట. ఇందులో వ్యాఖ్యాతగా వ్యవహరించినందుకుగానూ సల్మాన్​కు 200 కోట్ల రెమ్యునరేషన్​ వస్తోందని సమాచారం.

Salman Khan
సల్మాన్

By

Published : Nov 30, 2019, 12:15 PM IST

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'బిగ్‌ బాస్‌ సీజన్‌ 13'. ఈ షోలో వ్యాఖ్యాతగా ఓ చేస్తున్నందుకుగానూ సల్మాన్‌ రూ.200 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

'బిగ్‌బాస్‌ సీజన్‌ 4' నుంచి సల్మాన్‌ ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే అప్పటి నుంచి ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌ 13 వరకూ అతడి పారితోషికం ప్రతి సీజన్‌కు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం జరుగుతోన్న సీజన్‌కుగానూ ఈ కండల వీరుడికి వారానికి రూ.13కోట్లు (అనగా ఎపిసోడ్‌కు రూ.6.5కోట్లు) పారితోషికం ఇస్తున్నారు. అయితే ఇటీవల ఆ షోను మరో ఐదు వారాలపాటు పొడిగించనున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా సల్మాన్​ ఎపిసోడ్‌కు రూ.2 కోట్ల చొప్పున రెమ్యూనిరేషన్‌ను పెంచాడట.

ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. సల్మాన్‌ 'బిగ్‌బాస్‌ సీజన్‌ 13'లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు రూ.200 కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నారని పలువురు అనుకుంటున్నారు.

ఇవీ చూడండి.. తమన్ సంగీతానికి 'తకిట తకిట' అనాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details