తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పట్టాలెక్కిన రాధే... ఈద్​ కానుకగా విడుదల - సల్మాన్ ఖాన్ రాధే షూటింగ్ ప్రారంభం

బాలీవుడ్ సూపర్​స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తోన్న కొత్త చిత్రం 'రాధే'. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంది నిర్మాణ సంస్థ.

పట్టాలెక్కిన రాధే.. ఈద్​కు విడుదల

By

Published : Nov 1, 2019, 7:51 PM IST

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే 'దబాంగ్ 3' సినిమాను డిసెంబరు 20న విడుదల చేయనున్న సల్మాన్.. తన తదుపరి చిత్రం 'రాధే'ను పట్టాలెక్కించాడు. 2020 ఈద్​ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు భాయ్.

కొత్త సినిమాకు చెందిన ఫొటోను ట్విట్టర్లో పంచుకుంది సల్మాన్​ఖాన్ ​ఫిల్మ్స్​ నిర్మాణ సంస్థ. "రాధే ప్రయాణం మొదలైంది. 2020 ఈద్​కు రానున్నాడు" అనే సందేశాన్ని జోడించి పోస్ట్ చేసింది.

ఈ చిత్రంలో రణ్​దీప్ హుడా, జాకీ ష్రాఫ్, దిశాపటానీ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకుు. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. సల్మాన్ - ప్రభుదేవా కాంబినేషన్​లో రాబోతున్న మూడో చిత్రమిది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్​లో 'వాంటెడ్' విడుదల కాగా.. 'దబాంగ్ 3' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: ఈ నెలలోనే వెండితెరపై తోలుబొమ్మలాట..!

ABOUT THE AUTHOR

...view details