తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' షూటింగ్ ఏడు దేశాల్లో! - Tiger 3 to be shot across 7 countries

కండలవీరుడు సల్మాన్​ తర్వాతి సినిమా ఏడు దేశాల్లో షూటింగ్ జరుపుకోనుందట. ప్రస్తుతం లోకేషన్ల వేటలో చిత్రయూనిట్ ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశముంది.

Salman Khan starrer Tiger 3 to be shot across 7 countries?
సల్మాన్ ఖాన్

By

Published : Sep 17, 2020, 6:11 PM IST

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ ప్రస్తుతం టైగర్​ సిరీస్​లోని మూడో చిత్రం చేస్తున్నారు. మనీశ్ శర్మ దర్శకుడు, ఆదిత్య చోప్రా నిర్మాత. ఇప్పటికే వచ్చిన 'టైగర్'‌, 'టైగర్ జిందా హై' భాక్సాఫీసు దగ్గర సందడి చేశాయి. దీంతో ఈ భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకు తగ్గట్లే చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా షూటింగ్ మొత్తం ఏడు దేశాల్లోని లోకేషన్లలో జరగనుందట. యూఏఈ, ఇస్తాంబుల్, యూఎస్​లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్

సెప్టెంబరు 27న చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ 50 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా 'టైగర్ 3' గురించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశముంది.

ప్రస్తుతం 'రాధే'లో నటిస్తున్న సల్మాన్.. అది పూర్తయిన తర్వాత 'టైగర్ 3' సినిమాలో నటిస్తాడు. ఇందులోని నటీనటుల ఎవరనేది త్వరలో తెలియనుంది.

ABOUT THE AUTHOR

...view details