తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్​ పరిచయం చేస్తున్న మరో హీరోయిన్​ - dabangg

'దబాంగ్-3'తో పరిచయమవుతున్న సైయి మంజ్రేకర్​ ఫొటోను ఇన్​స్టాలో అభిమానులతో పంచుకున్నాడు హీరో సల్మాన్​ఖాన్. డిసెంబరు 20న రానున్న ఈ చిత్రంలో ఈమె ఓ కథానాయిక.

సల్మాన్​ పరిచయం చేస్తున్న మరో హీరోయిన్​

By

Published : Sep 22, 2019, 5:02 PM IST

Updated : Oct 1, 2019, 2:27 PM IST

కొత్త హీరోయిన్స్​ను పరిచయం చేయడంలో బాలీవుడ్​ కథానాయకుడు సల్మాన్​ఖాన్ ముందుంటాడు. కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, జరీన్ ఖాన్, అతియా శెట్టి తదితరులు అలా వచ్చినవారే. ఇప్పుడు ఆ జాబితాలోకి సైయి మంజ్రేకర్ చేరింది. ప్రముఖ నటుడు మహేశ్​ మంజ్రేకర్ కుమార్తె ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సల్మాన్​తో కలిసి 'దబాంగ్-3'లో నటిస్తోంది. సెట్​లో ఆమెతో ఉన్న ఓ ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నాడు భాయ్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోందీ చిత్రం. సోనాక్షి సిన్హా హీరోయిన్​గా నటిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దబాంగ్-3 సినిమాల సల్మాన్​ఖాన్

ఇది చదవండి: బాక్సాఫీస్​ ఊపిరి పీల్చుకో.. 'సైరా' వస్తున్నాడు

Last Updated : Oct 1, 2019, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details