బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు కమల్ ఖాన్.. కోర్టు ధిక్కారం చేస్తున్నారని, తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలని సల్మాన్ సోమవారం ఫిర్యాదు చేశారు.
Salman khan: కమల్ ఖాన్‌పై హీరో సల్మాన్‌ఖాన్ ఫిర్యాదు - సల్మాన్ ఖాన్ కమల్ ఖాన్
సినీ విశ్లేషకుడు కమల్ఖాన్పై గత నెలలో పరువునష్టం దావా వేసిన సల్మాన్‌ఖాన్.. ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేశారు. కమల్, కోర్టు ధిక్కారం చేస్తున్నారని, అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
![Salman khan: కమల్ ఖాన్‌పై హీరో సల్మాన్‌ఖాన్ ఫిర్యాదు Salman Khan seeks contempt action against Kamaal Khan for defamation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12046915-781-12046915-1623075754519.jpg)
సల్మాన్‌ఖాన్ సల్మాన్‌ఖాన్
గతనెలలో సల్మాన్ 'రాధే' విడుదల తర్వాత ఆ సినిమా గురించి చెబుతూ కమల్ ఓ వీడియో పోస్ట్ చేశారు. అదికాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులోని వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయని సల్మాన్ పరువు నష్టం దావా వేశారు.
కోర్టు ఆదేశించినప్పటికీ, తన క్లయింట్‌ను కించపరిచేలా కమల్ ఖాన్ ట్వీట్లు చేస్తున్నారని సల్మాన్ తరఫు న్యాయవాది సోమవారం వాదించారు. కమల్‌పై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఫిర్యాదు చేశారు.
Last Updated : Jun 7, 2021, 7:59 PM IST