బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, ఆయుశ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'(salman khan antim movie trailer). మహేశ్ వి.మంజ్రేకర్ దర్శకుడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ సమయంలో ఓ విలేకరి.. 'మీ పాత్రకు ఈ సినిమాలో హీరోయిన్ లేదు కదా ఎందుకు?' అని ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చారు సల్మాన్.
అందుకే నా పాత్రకు హీరోయిన్ లేదు: సల్మాన్ - సల్మాన్ ఖాన్ అంతిమ్
సల్మాన్ ఖాన్, ఆయుశ్ శర్మ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'అంతిమ్'(salman khan antim movie). నవంబర్ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రకు హీరోయిన్ ఎందుకు లేదో వెల్లడించారు సల్మాన్.
సల్మాన్
"ఈ సినిమా(salman khan antim movie) హీరోయిన్ లేకుండా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. రొమాంటిక్ కోణాన్ని జోడించి నా పాత్ర గొప్పతనాన్ని చెడగొట్టడం ఇష్టం లేక హీరోయిన్ను పెట్టలేదు" అంటూ తెలిపారు సల్మాన్.
గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ(salman khan antim movie) సాగుతుందని ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ఆయుశ్‌కు జోడీగా మహిమా మక్వానా కనిపించనుంది. నవంబరు 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.