తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్ 'రాధే' చిత్రంపై మీమ్స్ చూశారా! - Salman Khan Radhe record views

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే' చిత్రం గురువారం విడుదలైంది. అయితే తొలి రోజు నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈ మూవీని టార్గెట్​ చేస్తూ నెట్టింట మీమ్స్​తో సందడి చేస్తున్నారు.

Salman Khan
సల్మాన్ ఖాన్

By

Published : May 15, 2021, 11:02 AM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' ఈద్ కానుకగా మే 13న విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్​గా నటించగా జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ జీ5, జీప్లెక్స్​లో పే పర్ వ్యూ విధానంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే అన్ని డీటీహెచ్ ఆపరేటర్ల దగ్గర లభిస్తోంది.

అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు మాత్రం సినిమా అస్సలు బాగోలేదంటూ కామెంట్లు పెడుతూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా కథ, నటుల పర్ఫామెన్స్, సాంగ్స్ ఇలా అన్నింటిపై మీమ్స్ రూపొందిస్తున్నారు.

రికార్డు వ్యూస్

సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా రిలీజ్ రోజు మాత్రం జోరు చూపించింది 'రాధే'. ఏకంగా విడుదలైన 24 గంటల్లోనే 4.2 మిలియన్ల వ్యూస్​ను దక్కించుకుని రికార్డు నెలకొల్పింది. తొలిరోజే దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సమాచారం. దీంతో సల్మాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details