తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భారత్​'లో సల్మాన్ లుక్ అదిరింది

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'భారత్'. ఈ సినిమాలోని సల్మాన్ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

సల్మాన్ ఖాన్

By

Published : Apr 15, 2019, 11:36 AM IST

బాలీవుడ్‌ భాయ్ జాన్ సల్మాన్‌ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘'భారత్'’‌. కత్రినా కైఫ్, దిశా పటానీ, జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని సల్మాన్ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

నెరిసిపోయిన గడ్డం, జట్టుతో ఉన్న సల్మాన్ ఖాన్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచింది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ తో పాటు టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న రంజాన్ సందర్భంగా విడుదలవనుంది.

ABOUT THE AUTHOR

...view details