తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2019, 7:31 AM IST

Updated : Dec 27, 2019, 9:03 AM IST

ETV Bharat / sitara

నా పోరాటాలకు స్ఫూర్తి అతనే..!

బాలీవుడ్​ సూపర్​స్టార్​ సల్మాన్​ఖాన్​ అంటే తెలియని సినీ అభిమాని ఉండరు. ఎందుకంటే అతడు అంత ఫేమస్​ మరి. ఇంత మంది అభిమానం చూరగొన్న భాయ్​.. ఒక హాలీవుడ్​ స్టార్​ను స్ఫూర్తిగా తీసుకుంటాడట. అతడు ఎవరో తెలుసా..!

salman khan inspired by bruslee
నా పోరాటాలకు స్ఫూర్తి అతనే..!

సల్మాన్‌ఖాన్‌ తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఈలలు, గోలలతో థియేటర్​ మొత్తం హంగామా చేస్తుంటారు. అలాంటి స్టార్​ మాత్రం తనకు హాలీవుడ్‌ నటుడు బ్రూస్​లీనే స్ఫూర్తి అంటున్నాడు. తాజాగా సల్మాన్‌ నటించిన 'దబంగ్-3' తెరపై విజయ విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడుసల్మాన్‌.

సినిమాలో పోరాటాలకు సల్మాన్​, బ్రూస్లీనే ​స్ఫూర్తిగా తీసుకుంటాడట.

"సినిమాలో హీరో అంటే ఎప్పుడు వీరత్వంతోనే ఉండాలి. బాలీవుడ్‌ చిత్రాల్లో కథానాయకుడి బలమే సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అభిమానులు థియేటర్ నుంచి బయటకు వెళ్లటప్పుడు మన హీరోయిజం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడే సినిమాకి బలం పెరుగుతుంది. నేను సినిమాల్లో పోరాటాలు చేస్తున్నప్పుడు వెంటనే గుర్తుకొచ్చేది హాలీవుడ్‌ నటుడు బ్రూస్‌ లీనే. ఆయనను తలుచుకొంటే చాలు మనలో ఏదో తెలియని హీరోయిజం బయటకు వస్తుంది. నా బాల్యంలో బ్రూస్‌లీ చిత్రాలు చూసి హీరో అవ్వాలని అనుకునేవాణ్ణి. గోడపై ఆయన పోస్టర్లను చూస్తే కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే కోరిక పుడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకోవాలి"
- సల్మాన్​ఖాన్​, బాలీవుడ్​ నటుడు.

ప్రభుదేవా దర్శత్వంలో తెరపైకి వచ్చిన దబంగ్‌-3లో కథానాయికలుగా సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్‌ నటించగా, ప్రతినాయకుడి పాత్రలో కన్నడ నటుడు సుదీప్‌ నటించారు.

ఇదీ చదవండి:- 'ఆమీర్​కు తప్ప ఇంకెవరి కోసమూ ఇలా చేయను'

Last Updated : Dec 27, 2019, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details