మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi movies) కొత్త చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్(salman khan movies) నటించే అవకాశాలున్నాయంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. వీటిపై సంగీత దర్శకుడు తమన్(thaman songs) స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ చిరంజీవి, సల్మాన్‌ఖాన్ కలిసి నటిస్తున్నారని వెల్లడించారు.
చిరంజీవి హీరోగా, దర్శకుడు మోహన్‌రాజా తీస్తున్న చిత్రం 'గాడ్ ఫాదర్'(godfather movie). సూపర్‌హిట్ మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులోనే సల్మాన్‌ఖాన్ కనిపించనున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఓ హుషారైన గీతానికి డ్యాన్స్ చేయబోతున్నారని, ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌తో(britney spears songs) ఈ పాట పాడించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తమన్ తెలిపారు. ఆమెతో తెలుగు పాట పాడించాలా? ఇంగ్లిష్ సాంగ్ పాడించాలా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అన్నారు.