తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కత్రినా పెళ్లి తర్వాత సల్మాన్​ షాకింగ్ కామెంట్స్​.. సింగిల్​గా లేనంటూ.. - విక్కీ కౌశల్​

Salman Khan: కత్రినా కైఫ్​-విక్కీ కౌశల్​ వివాహంపై స్పందించారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ఖాన్. గతంలో కత్రినాతో సల్మాన్​ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే తాను పెళ్లి చేసుకోనప్పటికీ సింగిల్​గా మాత్రం లేనంటున్నారు సల్మాన్!

Salman khan
katrina kaif

By

Published : Jan 30, 2022, 4:57 PM IST

Salman Khan: బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ ఖాన్.. తాను సింగిల్​గా లేనని చెబుతున్నారు! గతంలో ఐశ్వర్య రాయ్​, కత్రినా కైఫ్​లతో భాయ్​ రిలేషన్​షిప్​లో ఉన్నారంటూ రూమర్లు వచ్చినా అవేవీ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఐదు పదుల వయసులోనూ పెళ్లి దూరంగా ఉన్న ఆయన.. కత్రినా కైఫ్​-విక్కీ కౌశల్​ వివాహంపై ఇటీవలే స్పందించారు. తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'బిగ్​బాస్​ 15' సీజన్​ ఫినాలే సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కత్రినా-విక్కీ జంట

ఈ కార్యక్రమానికి నటి, మోడల్ షెహనాజ్​ గిల్ అతిథిగా వచ్చారు. ఆమె గతంలో బిగ్​బాస్​కి కంటెస్టెంట్​గా కూడా వచ్చారు. షెహనాజ్​ను పలువురు 'పంజాబ్​ కత్రినా' అంటూ పిలిచేవారు. దీంతో ఈ షోకు వచ్చిన సందర్భంగా.. "నేను బిగ్​బాస్​కి వచ్చాక.. పంజాబ్​ కత్రినా కాస్తా.. ఇండియా షెహనాజ్​ అయిపోయింది. ఎందుకంటే పెళ్లి తర్వాత ఇండియా కత్రినా కాస్తా.. పంజాబ్​ కత్రినా అయిపోయింది" అంటూ సరదాగా వ్యాఖ్యానించింది.

కత్రినా కైఫ్

దీనిపై స్పందిస్తూ.. 'అవును పెళ్లితో కత్రినా-విక్కీ సంతోషంగా ఉన్నార'ని సల్మాన్ అన్నారు. వెంటనే 'మీరు కూడా సంతోషంగా ఉండండి సర్​' అనేసింది షెహనాజ్. అయినా సింగిల్​గా ఉంటేనే ఎంతో బాగుంటుంది అని కూడా అంది. దానికి.. 'నిజంగా సింగిల్​గా ఉంటే ఇంకా బాగుండేది' అని బదులిచ్చారు సల్మాన్​. 'అయితే రిలేషన్​షిప్​లో ఉన్నారా?' అని ఆమె అడగగా.. నవ్వేసి ఊరుకున్నారు భాయ్.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details