బాలీవుడ్లో తనదైన రీతిలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు హీరో సల్మాన్ ఖాన్. సినీ రంగంలోకి అడుగుపెట్టి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఈ ప్రయాణంలో తనను అభినందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
"భారతీయ సినీ రంగానికి కృతజ్ఞతలు. ఈ 31 ఏళ్ల ప్రయాణంలో ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు. ముఖ్యంగా ఇన్నేళ్ల పాటు ఆనందంగా సాగడానికి కారణం నా అభిమానులు, శ్రేయోభిలాషులే". -సల్మాన్ ఖాన్, హీరో
సల్మాన్ మెుదటి చిత్రం 'బీవీ హో తో హైసీ' అయినప్పటికీ.. అతడికి గుర్తింపు తెచ్చింది మాత్రం 1989లో వచ్చిన 'మైనే ప్యార్ కియా'. ఈ సినిమాతోనే బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు సల్మాన్.