తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విలన్​ సుదీప్​కు బహుమతిగా ఖరీదైన బీఎమ్​డబ్ల్యూ - cinema news

కన్నడ నటుడు సుదీప్​కు ఖరీదైన బీఎమ్​డబ్ల్యూ కారును కానుకగా ఇచ్చాడు హీరో సల్మాన్ ఖాన్. ఈ విషయాన్ని ఇన్​స్టాలో పంచుకొని, ధన్యవాదాలు చెప్పాడు సుదీప్.

విలన్​ సుదీప్​కు బహుమతిగా ఖరీదైన బీఎమ్​డబ్ల్యూ
సుదీప్-సల్మాన్​

By

Published : Jan 7, 2020, 7:26 PM IST

బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ఖాన్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూనే, తోటి నటీనటుల్ని ప్రోత్సహిస్తూ కానుకలు ఇస్తుంటాడు. ఇప్పుడు ఆ జాబితాలోకి 'ఈగ' ఫేమ్ సుదీప్ చేరాడు. వీరిద్దరూ ఇటీవలే 'దబంగ్ 3'లో కలిసి నటించారు. షూటింగ్ సమయంలో మంచి స్నేహితులయ్యారు. ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో సుదీప్​కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు సల్మాన్.

సుదీప్ ఇంటికి వెళ్లి, సర్​ప్రైజ్​ చేసి, ఖరీదైన బీఎమ్​డబ్ల్యూ ఎమ్5ను బహుకరించాడు సల్మాన్. ఈ సందర్భంగా ఇన్​స్టాలో పోస్ట్​ పెడుతూ భాయ్​కు ధన్యవాదాలు చెప్పాడు.

"మీరు మంచి చేస్తే మీకు మంచే జరుగుతుంది. ఇది నిజమని నమ్మేలా సల్మాన్​ చేశారు. నాపై, నా కుటుంబంపై మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు మీతో కలిసి పనిచేయడం, మీరు మా కోసం రావడం ఎంతో సంతోషం" -ఇన్​స్టాలో సుదీప్

ABOUT THE AUTHOR

...view details