తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని ఓ వ్యక్తిపై దావా వేసిన స్టార్ హీరో - ముంబయి కోర్టులో సల్మాన్ పిటిషన్

Salman Khan Petition: తనపై సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఓ వ్యక్తిపై కేసు వేశారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. సంబంధిత వ్యక్తి పన్వేల్​లోని తన ఫామ్​హౌస్​ సమీపంలోనే ఉంటాడని సల్మాన్ తెలిపారు. సోషల్​ మీడియాలో తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్​ను తొలగించేలా చూడాలని కోరారు.

salman khan
సల్మాన్ ఖాన్

By

Published : Jan 15, 2022, 10:09 PM IST

Salman Khan Petition: మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నారంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్ ఓ వ్యక్తిపై కేసు వేశారు. పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌ సమీపంలో ఉండే వ్యక్తి కేతన్‌ కక్కడ్‌పై ముంబయి సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆయా మాధ్యమాల్లో సల్మాన్‌కు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేలా లేదా బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన న్యాయ బృందం శుక్రవారం కోర్టును కోరింది. ముంబయిలోని మలాడ్‌ ప్రాంతానికి చెందిన కేతన్ కక్కడ్‌కు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్ సమీపంలో భూమి ఉన్నట్లు సమాచారం.

సల్మాన్‌ న్యాయవాదుల వివరాల ప్రకారం.. కేతన్ నెల రోజుల క్రితం ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ను కించపరిచేలా మాట్లాడాడు. ఈ క్రమంలో కేతన్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను, గూగుల్, యూట్యూబ్, ట్విటర్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా సంస్థలనూ ఈ కేసులో చేర్చారు. సల్మాన్‌ను దూషిస్తూ, అవమానిస్తూ పోస్టులు పెట్టడం, కంటెంట్‌ అప్‌లోడ్‌ చేయడం, ట్వీట్లు, ఇంటర్వ్యూలు, ప్రింటింగ్, పబ్లిషింగ్, బ్రాడ్‌కాస్టింగ్ తదితర అన్ని మార్గాలపై నిషేధం విధించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సల్మాన్‌ న్యాయ బృందం కోర్టును కోరింది.

మరోవైపు కేతన్‌ తరఫు న్యాయవాదులు ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ.. తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. విచారణకు ఒక రోజు ముందు మాత్రమే తమకు కేసు పత్రాలు అందాయని, మొత్తం వ్యవహారాన్ని పరిశీలించేందుకు సమయం లభించలేదని తెలిపారు. సల్మాన్ ఖాన్ ఈ దావా వేసేందుకు ఒక నెల తీసుకోగా, కక్కడ్‌కు కూడా సమాధానం చెప్పేందుకు టైం ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు కేతన్‌కు అనుకూలంగా సమయం మంజూరు చేసింది. కేసును జనవరి 21కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details