'రాధే' చిత్రానికి రివ్యూ ఇచ్చిన కమాల్ ఆర్.ఖాన్ అనే వ్యక్తిపై హీరో సల్మాన్ ఖాన్ లీగల్ టీమ్ కోర్టును ఆశ్రయించింది. ముంబయి సిటీ కోర్టులో పరువు నష్టం దావా కేసు నమోదు చేసి సదరు వ్యక్తికి నోటీసులు పంపింది. ఇదే విషయాన్ని కమాల్ ఆర్.ఖాన్ తన ట్విట్టర్లో వెల్లడించారు. రాధే సినిమా రివ్యూ వ్యవహారమై ఇదంతా చేశారని ఆయన పేర్కొన్నారు.
"సినిమా నిర్మాత నన్ను రివ్యూ ఇవ్వొద్దంటే ఇవ్వనని చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు నా రివ్యూపై సల్మాన్ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. నేను రాసిన రివ్యూ వల్ల సల్మాన్ ఇబ్బంది పడ్డారనుకుంటా. ఇకపై సల్మాన్ చిత్రాలకు రివ్యూ ఇవ్వను".
- కమాల్ ఆర్.ఖాన్ ట్వీట్ సారాంశం