స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ జీవితం ఆధారంగా 'బియాండ్ ద స్టార్: సల్మాన్‌ఖాన్'(salman khan documentary) అనే డాక్యుమెంటరీ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటీనటులు అందరూ దాదాపుగా ఇందులో కనిపించనున్నారు. హీరోయిన్ ఆలియా భట్(alia bhatt first movie).. ఈ సిరీస్‌కు యాంకర్‌గా వ్యవహరించనుంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ(sanjay leela bhansali upcoming movies) కూడా ఇందులో భాగం కావడం విశేషం.
భన్సాలీ.. సల్మాన్, ఆలియాతో 'ఇన్-షా అల్లా' సినిమా తీయాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ సిరీస్‌తో జోడీని కుదిర్చారు.
"సూపర్‌స్టార్ స్టార్డమ్ కాకుండా ఎవరికీ తెలియని సల్మాన్ ప్రపంచాన్ని ఈ సిరీస్‌లో చూపించనున్నారు. సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలోని స్నేహితులు సాజిద్ నడియావాలా, డేవిడ్ ధావన్, అనీష్ భజ్మీ, జాకీష్రాఫ్, సంజయ్‌దత్ చెప్పిన విశేషాలను ఇప్పటికే రికార్డు కూడా చేశారు" అని సల్మాన్(salman khan documentary) సన్నిహితుడు చెప్పారు.
అయితే ఇది తొలి సీజన్ మాత్రమే అని, దీనిని ఫ్రాంఛైజీగానూ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది ద్వితియార్ధంలో ప్రముఖ ఓటీటీలో(ott full form) దీనిని విడుదల చేయనున్నారు.
ఇవీ చదవండి: