బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ నటిస్తున్న 'రాధే' సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. షూటింగ్లో పాల్గొన్నట్లు సోషల్‌మీడియాలో సల్మాన్ ఓ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. లాక్డౌన్ తర్వాత కరోనా నియంత్రణ చర్యలను పాటిస్తూ 'రాధే' షూటింగ్ పునఃప్రారంభించినట్లు ఆ చిత్రనిర్మాణ సంస్థ సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ తాజాగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణలో సల్మాన్‌తో సహా దిశా పటానీ కూడా పాల్గొంది.
'రాధే' షూటింగ్లో పాల్గొన్న సల్మాన్, దిశా పటానీ
దాదాపు ఆరు నెలల తర్వాత చిత్రసీమలో షూటింగ్‌లు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవలే తాను నటిస్తున్న 'రాధే' చిత్రీకరణలో పాల్గొన్నట్లు సోషల్‌మీడియాలో వెల్లడించాడు. తాజాగా ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణలో హీరోయిన్ దిశా పటానీ అడుగుపెట్టింది.
సెట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ తగిన ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారని ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న జాకీ ష్రాఫ్ వెల్లడించారు. ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. "గతంలో దాదాపు 200 మందితో కలిసి పనిచేసే వాళ్లకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా బాధలో ఉంది" అని అన్నారు.
'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వేసవిలో విడుదల కావాల్సింది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది.