సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భారత్'. మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడీ కండల వీరుడు. వాటికి సంబంధిచిన లుక్‌లను ఒక్కొక్కటిగా విడుదల చేశారు. అవన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. 1964, 1970, 2010.. ఇలా మూడు సంవత్సరాలు ఆ పోస్టర్లపై దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
సల్మాన్ ఖాన్ 'భారత్'... త్రిపుల్ ధమాకా - సల్మాన్ ఖాన్ త్రిబుల్ రోల్
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'భారత్'. ఒక్కొక్కటిగా విడుదలవుతున్న సల్మాన్ పోస్టర్లు అభిమానుల్ని అలరిస్తున్నాయి.
![సల్మాన్ ఖాన్ 'భారత్'... త్రిపుల్ ధమాకా](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3025098-thumbnail-3x2-bharat.jpg)
సల్మాన్ ఖాన్ 'భారత్'... త్రిబుల్ ధమాకా
కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. వీరిద్దరూ ఇంతకుముందు 'సుల్తాన్','టైగర్ జిందా హై' లాంటి హిట్ చిత్రాల్ని తెరకెక్కించారు. ఈ సినిమా మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఇది చదవండి: 'భారత్'లో సల్మాన్ లుక్ అదిరింది