బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న కొత్త చిత్రం 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' చిత్రీకరణ ఆదివారం ప్రారంభమైంది. దాదాపు ఆరు నెలల తర్వాత షూటింగ్లో పాల్గొన్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు సల్మాన్. జాకెట్ ధరించి, కెమెరాకు ఎదురుగా ఉన్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
ఆరు నెలల తర్వాత కెమెరా ముందుకు సల్మాన్ - సల్మాన్ బిగ్‌బాస్
దాదాపు ఆరు నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశాడు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. తాను నటిస్తున్న కొత్త చిత్రం 'రాధే' చిత్రీకరణ ఆదివారం నుంచి పునఃప్రారంభమైందని వెల్లడించాడు.
ఆరు నెలల తర్వాత కెమెరా ముందుకొచ్చిన సల్మాన్
"ఆరు నెలల తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొనడం చాలా బాగా అనిపిస్తోంది" అని క్యాష్షన్ ఇచ్చాడు సల్మాన్. 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా.. దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు రావల్సింది. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. బుల్లితెర రియాల్టీషో బిగ్‌బాస్ 14వ సీజన్ షూటింగ్‌లోనూ సల్మాన్ ఇటీవలే పాల్గొన్నాడు.