తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ పని చేయొద్దు ప్లీజ్'.. ఫ్యాన్స్​కు సల్మాన్ విజ్ఞప్తి - Salman khan requests to fans

Salman khan message to fans: అభిమానులకు ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు బాలీవుడ్​ హీరో సల్మాన్​ ఖాన్. తన ఫ్లెక్సీలపై పాలాభిషేకం చేయొద్దని, అందుకు బదులుగా పేద పిల్లలకు పాలను దానం చేయాలని ఫ్యాన్స్​ను కోరారు.

Salman Khan asks fans to not 'waste' milk, అభిమానులకు సల్మాన్​ ఖాన్​ విజ్ఞప్తి
అభిమానులకు సల్మాన్​ ఖాన్​ విజ్ఞప్తి

By

Published : Nov 28, 2021, 7:14 PM IST

Salman khan gave message to fans: సాధారణంగా అభిమానులు తమ హీరో సినిమా విడుదల రోజు హడావుడి చేస్తుంటారు. అల్లరి చేయడం, థియేటర్లో పేపర్స్​ విసరడం, ఫ్లెక్సీలపై పాలాభిషేకం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. వీరిలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించేవారూ ఉంటారు.

ఇటీవల బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ నటించిన 'అంతిమ్​: ది ఫైనల్​ ట్రూత్'(Salman khan antim movie)​ సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా కొంతమంది ఫ్యాన్స్​.. సల్మాన్​ ఫ్లెక్సీపై లీటర్ల కొద్ది పాలతో అభిషేకం చేశారు. మరికొంతమంది థియేటర్​లో టపాసులు కాలుస్తూ పక్కవారిని భయాందోళనకు గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్​గా మారాయి.

తాజాగా దీనిపై స్పందించిన సల్మాన్​.. "కొంతమందికి తాగడానికి నీరు దొరకడం లేదు. మీరు పాలను వృథా చేసే బదులు వాటిని పేదపిల్లలకు ఇవ్వాలని కోరుతున్నాను" అని విజ్ఞప్తి చేశారు. టపాసులు కాల్చే విషయమై స్పందిస్తూ.. "థియేటర్​లో ఇలాంటి పనులు చేయకండి. ఇలాంటి పనుల వల్ల మీ ప్రాణాలతో పాటు, తోటివారి ప్రాణాలకు కుడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఫ్యాన్స్​ క్రాకర్స్​ తీసుకొని థియేటర్లలోకి ప్రవేశించకుండా నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోవాలి." అని అన్నారు.

ఇదీ చూడండి: సల్మాన్​ కొత్త సినిమాలో తొమ్మిది మంది హీరోయిన్లు

ABOUT THE AUTHOR

...view details