బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్. అతడ్ని కోల్పోవడం ఎంతో బాధకరమైన విషయమని అన్నారు. సుశాంత్ కుటుంబానికి అండగా నిలవాలని, తన అభిమానులను కోరారు.
"సుశాంత్ అభిమానుల అన్న మాటలు వెనుక భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం వల్ల కలిగే బాధ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అతడి కుటంబానికి, అభిమానులకు మీరు అండగా ఉండి, ధైర్యం చెప్పాలని నా ఫ్యాన్స్‌కు చెబుతున్నా"
-సల్మాన్‌ఖాన్, బాలీవుడ్ కథానాయకుడు
సుశాంత్ మరణానికి బాలీవుడ్‌లోని నెపోటిజమ్ ఓ కారణమని పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆరోపణలు చేశారు. అతడి ఆత్మహత్యకు హీరో సల్మాన్, నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, రియాచక్రవర్తి, నిర్మాత ఏక్తా కపూర్లు కారణమని బిహార్‌లోని ఓ న్యాయవాది సుధీర్‌కుమార్ ఓజా ఇటీవలే కోర్టులో కేసు వేశారు. బిహార్‌లోని ఓ విద్యార్థి సంఘం కూడా అతడి మృతికి నిరసన తెలుపుతూ సల్మాన్, కరణ్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు.