బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'(salman khan antim movie trailer). ఆయుష్ శర్మ కీలకపాత్ర పోషించాడు. మహేశ్ వి.మంజ్రేకర్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది(salman khan antim movie). సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సల్మాన్ సిక్కు పోలీసు అధికారిగా కనిపించారు. గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నవంబరు 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'లవ్‌స్టోరీ'(lovestory movie) ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పడీ చిత్రాన్ని 'ప్రేమతీరమ్' పేరుతో మలయాళంలో అక్టోబర్ 29న విడుదల చేయనున్నారు(lovestory movie release date). ఈ సందర్భంగా సోమవారం(అక్టోబర్ 25) దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.