తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒకే సినిమాలో ఖాన్​ త్రయం.. అభిమానులకు పండగే.! - Shahrukh Khan

బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్, ఆమిర్​లు కలిసి పనిచేయనున్నారట. 'లాల్ సింగ్ చద్ధా'లో వీరు ముగ్గురు కనిపిస్తారని సినీ వర్గాల టాక్.

ఖాన్

By

Published : Nov 4, 2019, 3:12 PM IST

Updated : Nov 4, 2019, 3:45 PM IST

బాలీవుడ్​లో ఖాన్ త్రయానికి అభిమానులు ఎక్కువే. వీరి సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ ఈ ముగ్గురు కలిసి ఇప్పటివరకు మూవీ చేయలేదు. కానీ ఫ్యాన్స్​ అందరూ వీరి కలయికలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఎప్పుటినుంచో అనుకుంటున్నారు. తాజాగా ఇలాంటి వార్త ఒకటి హిందీ చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.

ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'లాల్ సింగ్ చద్ధా'. హాలీవుడ్​లో వచ్చిన 'ఫారెస్ట్ గంప్'​ ఆధారంగా తెరకెక్కుతోంది. 'సీక్రెట్ సూపర్​ స్టార్'​ ఫేం అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇందులో ఆమిర్​తో పాటు సల్మాన్​, షారుఖ్​ కూడా నటిస్తున్నారట.

స్క్రిప్టులో కీలకమైన పాత్ర కోసం షారుఖ్​ను ఆమిర్ సంప్రదించాడట. ఈ పాత్రే కథను మలుపుతిప్పుతుందట. దీనికి కింగ్ ఖాన్​ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్​కూ మంచి పాత్ర ఉందట. మరి ఇదే నిజమైతే ముగ్గురు ఖాన్​లను ఒకే తెరపై చూడాలన్న బాలీవుడ్ ప్రేక్షకుల కల నిజమవడం ఖాయం.

ఇవీ చూడండి.. సంజయ్.. కృతి భలేగా దర్శనమిచ్చారు కదా..

Last Updated : Nov 4, 2019, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details