తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్-షారుక్ సినిమా.. ఎప్పుడంటే? - tiger 3

Salman Khan Shahrukh Khan movie: బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ 'పఠాన్' సినిమాలో నటించబోతున్నట్లు స్పష్టంచేశారు స్టార్​ హీరో సల్మాన్ ఖాన్. భవిష్యత్తులో తాము కలిసి సినిమా చేసే అవకాశముందని అన్నారు.

salman khan shahrukh khan movie
సల్మాన్‌ ఖాన్

By

Published : Dec 28, 2021, 10:45 AM IST

Updated : Dec 28, 2021, 11:53 AM IST

Salman Khan Shahrukh Khan movie: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్, స్టార్​ హీరో షారుక్‌ ఖాన్​ మరోసారి కలిసి నటించే అవకాశం ఉంది. 1995లో వచ్చిన 'కరణ్-అర్జున్' తర్వాత పూర్తి స్థాయి చిత్రంలో వారు కలిసి నటించలేదు. అయితే ఒకరి సినిమాలో మరొకరు.. అతిథి పాత్రల్లో మెరుస్తూ అభిమానులను అలరించారు. ఇక షారుక్ కొత్త సినిమా 'పఠాన్​'లో సల్మాన్​, భాయ్ 'టైగర్​ 3'లో బాద్​షా గెస్ట్​ రోల్​ చేయనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అవి నిజమేనని స్పష్టం చేశారు సల్మాన్.

షారుక్‌ ఖాన్​

"నేను, షారుఖ్‌ కలిసి 'టైగర్‌ 3', 'పఠాన్‌' చిత్రాల్లో నటిస్తున్నాం. ఇందులో 'టైగర్‌ 3' వచ్చే ఏడాది డిసెంబరులో విడుదల కానుంది. అంతకంటే ముందే 'పఠాన్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి మరో చిత్రంలో కూడా నటించొచ్చేమో"

-సల్మాన్ ఖాన్, నటుడు

రాజమౌళి దర్శకత్వంలో సల్మాన్?

సల్మాన్‌ ఖాన్

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్​లో సినిమాపై స్పందించారు సల్మాన్. "రాజమౌళితో నేను సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఒకవేళ ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే నేనెంతో సంతోషిస్తా. ప్రస్తుతం 'టైగర్‌ 3', 'కబీ ఈద్‌ కబీ దివాలీ' సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటున్నా. అవి పూర్తయ్యాకా 'భజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ సినిమాకు 'పవన్‌పుత్ర భాయిజాన్‌' అనే పేరుని నిర్ణయించాం.

ఇదీ చూడండి:'టైగర్​ బతికే ఉన్నాడు.. పాము కూడా బతికే ఉంది'

Last Updated : Dec 28, 2021, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details